: సౌదీ రాజకుటుంబంలో సంక్షోభం.. సింహాసనం కోసం కుట్ర!

సౌదీ అరేబియా యువరాజు ప్రిన్స్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ ముస్సాద్ బిన్ సౌద్ అరెస్ట్ కు రాజు సల్మాన్ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. యూట్యూబ్ లో పోస్ట్ అయిన ఓ వీడియోలో ఆయన ఒక వ్యక్తి కణతకు రైఫిల్ గురిపెట్టి దౌర్జన్యం చేశాడు. అప్పటికే బాధితుడి తల నుంచి రక్తం కారుతోంది. తనను వదిలి పెట్టాలంటూ బాధితుడు కాళ్లావేళ్లా పడుతున్నాడు. మరోవైపు, పక్కనే ఉన్న ఓ టేబుల్ పై 18 మద్యం సీసాలు, డబ్బు ఉన్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో... యువరాజు అరెస్ట్ కు రాజు ఆదేశాలు జారీ చేశారు. ఏ బెయిల్ పై కూడా అతన్ని విడుదల చేయవద్దని ఆదేశించారు.

మరోవైపు, ప్రస్తుత రాజు సల్మాన్ తర్వాత సింహాసనాన్ని అధిరోహించేందుకు వరుసలో ఉన్న అబ్దుల్ బిన్ నయీఫ్ పై గత నెలలో వేటు వేశారు. అనంతరం తన మూడో భార్య కుమారుడైన మహ్మద్ బిన్ సల్మాన్ ను తన వారసుడిగా రాజు ప్రకటించారు. అయితే, దీని వెనుక పెద్ద కుట్ర దాగుందని... జూన్ 20వ తేదీ అర్ధరాత్రి సయీఫ్ పై మహ్మద్ బిన్ సల్మాన్ కుట్ర పన్ని ఆయనపై వేటు పడేలా చేశారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

More Telugu News