Hansika: సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం

*  ఇటీవల మూడు నెలల పాటు తెలుగు, తమిళ సినిమాల షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడిపిన అందాల హన్సిక ఇప్పుడు వెకేషన్ తీసుకుంది. ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేయడానికి యూరప్ దేశాలకు చెక్కేసింది.
*  ప్రస్తుతం 'స్టార్ మా' టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోను రక్తికట్టించడానికి హాట్ యాంకర్ అనసూయ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆ షోలో జాయిన్ అవుతుందంటూ ప్రచారం జరిగిన సంగతి విదితమే. అయితే, ఈ వార్తలను తాజాగా అనసూయ ఖండించింది. ఆ షోలో పాల్గొనేంత సమయం తనకు లేదని, ఇప్పటికే కమిట్ అయిన ప్రాజక్టులతో బిజీగా వున్నానని ఈ ముద్దుగుమ్మ పేర్కొంది.
*  ధనుశ్ హీరోగా సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన 'వీఐపి 2' చిత్రం తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తయింది. అయితే, తెలుగు, హిందీ వెర్షన్ల సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ చిత్రం విడుదల మొదట పేర్కొన్నట్టు ఈ 28న కాకుండా వచ్చే నెలకు వెళ్లచ్చని అంటున్నారు. ఇందులో అమలాపాల్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటి కాజోల్ విలన్ గా కీలక పాత్ర పోషించింది.
*  కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన 'రాజకుమార' చిత్రం పెద్ద హిట్టయింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్టీఆర్ రీమేక్ చేస్తాడంటూ వార్తలొచ్చాయి. అయితే, ఇందులో వాస్తవం లేదని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.

More Telugu News