allari naresh: 'మేడమీద అబ్బాయి' పై ఫిల్మ్ నగర్ టాక్

ఈ మధ్యకాలంలో అల్లరి నరేశ్ ను సక్సెస్ అనేది పలకరించలేదు. దాంతో ఆయన 'మేడ మీద అబ్బాయి' పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ టీవీ ఛానల్ వారు రెండున్నర కోట్లకి సొంతం చేసుకున్నారు. ఈ శాటిలైట్ రైట్స్ డీల్ విషయంలో అల్లరి నరేశ్ ప్రముఖమైన పాత్రను పోషించాడని అంటున్నారు.

 ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే, అల్లరి నరేశ్ కి హిట్స్ లేని కారణంగా డల్ గానే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బిజినెస్ పైనా అల్లరి నరేష్ దృష్టి పెట్టాడనీ .. స్వయంగా ఆయన రంగంలోకి దిగాడని కూడా చెబుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ టైటిల్ జనంలోకి బాగా పోయింది. కథ ఏ మాత్రం బాగున్నా ఆడియన్స్ వసూళ్ల మూటను దోసిట్లో పెట్టేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'మేడమీద అబ్బాయి' ఏం చేస్తాడో చూడాలి మరి.        

More Telugu News