: ట్రంప్‌కు షాక్.. వీగిన ఒబామా కేర్ రద్దు తీర్మాన బిల్లు.. సొంత సెనేటర్లే ముంచారన్న అమెరికా అధ్యక్షుడు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సెనేటర్లు షాకిచ్చారు. సెనేట్‌లో ప్రవేశపెట్టిన ఒబామా కేర్ రద్దు తీర్మాన బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. దీనికి సొంతపార్టీ సెనేటర్లే కారణమంటూ ట్రంప్ దుమ్మెత్తి పోస్తున్నారు. డెమోక్రాట్లతో కొంతమంది తమ సభ్యులు (రిపబ్లికన్లు) కలసి తనను ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడితో ఆగిపోబోమని, త్వరలోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, దేశంలోని కంపెనీల వ్యాపార అవసరాల కోసం అదనంగా 15వేల హెచ్-2బీ వీసాలను ప్రభుత్వం పెంచింది. తాత్కాలిక ప్రాతిపదికన వెంటనే 15వేల మంది ఉద్యోగులను తీసుకోకపోతే అమెరికాలో వ్యాపారాలు కుదేలయ్యే పరిస్థితి ఉండడంతో ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.

More Telugu News