: రాజ‌కీయ విధానాల పేరుతో అక్ర‌మంగా ప్ర‌వేశించొద్దు: భార‌త్‌కు చైనా హెచ్చ‌రిక‌

పాల‌సీల పేరు చెప్పి సిక్కింలోని డోక్లాం ప్రాంతంలోకి భార‌త్ అక్ర‌మంగా ప్ర‌వేశించొద్ద‌ని, అలా చేస్తే ఏర్ప‌డే ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకోవాల‌ని భార‌త్‌ను చైనా హెచ్చ‌రించింది. వీలైనంత త్వ‌ర‌గా అక్క‌డి బ‌ల‌గాల్ని వెన‌క్కి పిలిపించాల‌ని చైనా చెప్పింది. త‌మ విదేశీ వ్య‌వ‌హారాల గురించి ప్ర‌భుత్వంతో సంప్ర‌దిస్తున్న‌ట్లు, డోక్లాం వివాదానికి సంబంధించి త‌మ‌కు ఎలాంటి ఆదేశాలు రాలేద‌ని చైనా విదేశాంగ ప్ర‌తినిధి తెలిపారు. చైనా ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు భార‌త సైనికులు అక్ర‌మంగా డోక్లాం ప్రాంతంలోకి చొర‌బ‌డ‌కుండా చూడాల‌ని, ఒకవేళ చొర‌బ‌డితే ప‌రిణామాలు తీవ్ర రూపం దాల్చే అవ‌కాశం ఉంద‌ని చైనా విదేశాంగ ప్ర‌తినిధులు కాంగ్ చెప్పారు. గ‌త నెల రోజులు డోక్లాం స‌రిహ‌ద్దు వ‌ద్ద భార‌త‌, చైనా ఆర్మీల మ‌ధ్య ఉత్కంఠ ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే!

More Telugu News