: ప‌న్ను చెల్లించే వారికోసం ఆదాయ‌పు ప‌న్ను శాఖ యాప్‌!

ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపుదారుల సౌల‌భ్యం కోసం `మై ట్యాక్స్ యాప్‌`ను రూపొందించిన‌ట్లు ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌బోయే ఈ యాప్ ద్వారా ఆదాయ‌పు ప‌న్నుకు సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని తెలుసుకోవ‌చ్చు. అలాగే ఎంత ప‌న్ను చెల్లించారు?, ప‌న్ను చెల్లింపు విష‌యంలో వ‌చ్చే ఇబ్బందుల‌పై ఫిర్యాదులు కూడా ఈ యాప్ ద్వారా చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. వ్య‌క్తిగ‌త పాన్ నెంబ‌ర్ ఆధారంగా ఈ యాప్ ప‌నిచేస్తుంది.

ఇప్ప‌టికే పన్ను చెల్లించ‌డానికి, పాన్‌, టాన్ ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి `ఆయ‌కార్ సేతు` పేరుతో ఆదాయ‌పు ప‌న్నుశాఖ యాప్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ యాప్ అంద‌రికీ ఒకేలా ప‌నిచేస్తుంది. దీనితో పోలిస్తే `మై ట్యాక్స్ యాప్‌` మ‌రింత వ్య‌క్తిగ‌తంగా ప‌నిచేస్తుంది. దీనికి ప‌ర్స‌న‌లైజ్డ్ లాగిన్ వివ‌రాలు, సెక్యూరిటీ స‌దుపాయాలు వుంటాయి. ప‌న్ను చెల్లించేవారిని కూడా వినియోగదారులుగా చూడాలంటూ చెప్పిన పార్థ‌సార‌థి షోమ్ క‌మిటీ సూచ‌న‌ల మేర‌కు ప‌న్ను వ్య‌వ‌హారాల్లో సంస్క‌ర‌ణ‌ల ప‌నిని ఐటీ శాఖ ముమ్మ‌రం చేస్తోంది.

More Telugu News