: ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు గురించిన విశేషాలు!

అందరూ ఊహించినట్టుగానే, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం.వెంకయ్యనాయుడు పేరును ఖరారు చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన వెంకయ్యనాయుడు గురించిన ఆసక్తికర విశేషాలు

* 1949 జులై 1న వెంకయ్యనాయుడు జన్మించారు
* పదో తరగతి వరకు నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజా హైస్కూల్ లో విద్యనభ్యసించారు
* విఆర్ కళాశాలలో డిగ్రీ చదివారు
* ఆంధ్రా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించారు
* చిన్ననాటి నుంచే ఆర్ఎస్ఎస్ తో అనుబంధం
* ఏబీవీపీలో చురుకైన కార్యకర్తగా పని చేశారు
* జై ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు
* నాడు ‘ఎమర్జెన్సీ’పై వెంకయ్య నిరసన గళం విప్పారు
* బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా పని చేశారు
* 1978లో ఉదయగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు
* 1983 ఎన్నికల్లోనూ ఉదయగిరిలో విజయం సాధించారు
* 1996 నుంచి 2000 వరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేశారు
* 1998, 2004, 2010లో రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు
* 1999లో వాజ్ పేయి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
* 2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
* 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు
* 2014లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు
* తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల దిట్ట
* రాజకీయ సంక్షోభాలను పరిష్కరించడంలో క్రియాశీలకుడు
* ఏపీ విభజన సమయంలో కీలక సలహాలు, సూచనలు చేశారు.

More Telugu News