: చైనా దుస్సాహసం... టిబెట్ లో లైవ్ ఫైర్ డ్రిల్స్ మొదలు

సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, వేడిని మరింతగా పెంచుతూ చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టిబెట్ భూ భాగంలో లైవ్ ఫైర్ డ్రిల్స్ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను చైనా అధికార సెంట్రల్ టెలివిజన్ విడుదల చేసింది. ఈ డ్రిల్స్ ఎప్పుడు జరిగాయన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించనప్పటికీ, దేశానికి చెందిన రెండు సైనిక దళాలు పాల్గొన్నాయని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇండియా, చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపంలోనే ఈ డ్రిల్స్ జరిగాయని పేర్కొంది.

బ్రహ్మపుత్రా నది వెనుకవైపు కనిపిస్తుండటంతో ఇది భారత్ కు సమీపంలోనే జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. యాంటీ ట్యాంక్ గ్రనేడ్లు, హోవిట్జర్ గన్స్ తదితరాలను వాడుతూ, లక్ష్యాలను ఎలా పేల్చివేయవచ్చన్న విషయమై 11 గంటల పాటు ఈ డ్రిల్ జరిగినట్టు తెలుస్తోంది. ఇదిలావుడగా, ఈ నెల 10వ తేదీని టిబెట్ సైనిక దళాలు సైతం ఇదే తరహా విన్యాసాలు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News