'ఉయ్యాలవాడ' టైటిల్ 'మహావీర'గా మారనుందా?

17-07-2017 Mon 10:11
చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'ని తెరకెక్కించడానికి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. స్వాతంత్ర్య పోరాట యోధుడి చరిత్ర కావడంతో, భారీ బడ్జెట్ తో .. బహు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

 అందువలన అన్ని భాషలకి సంబంధించి ఒకే టైటిల్ పెడితే బాగుంటుందనే ఆలోచన చేశారు. అలా ఈ సినిమాకి 'మహావీర' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు. కథాపరంగా కూడా ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. మెగా అభిమానుల నుంచి ఈ టైటిల్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.