gopichand: ఫారిన్ లొకేషన్లు .. హీరోయిన్స్ గ్లామర్ 'గౌతమ్ నంద'కి ప్రత్యేక ఆకర్షణలు

గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన 'గౌతమ్ నంద' .. నిన్న రాత్రి ఆడియో వేడుక జరుపుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. సంపత్ నంది ఈ సినిమాను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడనీ .. ప్రతి సన్నివేశం ఆడియన్స్ ను ఆకట్టుకునేదిలా ఉంటుందని చెప్పాడు. ఈ సినిమాలో తాను పోషించిన పాత్ర తనకి ఎంతో సంతోషాన్నీ .. సంతృప్తిని ఇచ్చిందని అన్నాడు. తన  అభిమానులు తన సినిమా నుంచి ఆశించే అన్ని అంశాలు ఇందులో వుంటాయని చెప్పాడు.

ఇక భారీ తనం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కాగలదని ఈ సినిమా టీజర్ .. ఎటైలర్ చూసిన వాళ్లు చెప్పుకుంటున్నారు. విదేశీ లొకేషన్స్ కి సంబంధించిన రిచ్ విజువల్స్ థియేటర్స్ రప్పించే ఛాన్స్ ఉందనీ .. హన్సిక - కేథరిన్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ కాగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ కలిసి గోపీచంద్ కి హిట్ తెచ్చి పెడతాయేమో చూడాలి మరి.  

More Telugu News