: ఇండియాలో ఏముంది నేను కోల్పోవడానికి?: విజయ్ మాల్యా

ఇండియాలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి, ఇంగ్లండ్ పారిపోయి, అక్కడ విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్న యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా, ఇండియాను తక్కువ చేస్తూ మాట్లాడారు. బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలు జరుగుతున్న వేళ, రాయ్ టర్స్  వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ, "ఇండియాలో నేను కోల్పోవడానికి ఏమీ లేదు" అన్నారు. తన కుటుంబం అంతా ఇంగ్లండ్ లేదా యూఎస్ లోనే ఉందని, ఇండియాలో తనవాళ్లెవరూ లేదని, తనవారందరూ యూకే పౌరులేనని, అందువల్ల ఇండియాలో లేకపోవడం వల్ల తాను కోల్పోయిందేమీ లేదని అన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేసిన మాల్యా, తనను ఓ భూతంలా చూస్తూ వేటాడాలని భారత్ చూస్తోందని ఆరోపించారు. తానేమీ తప్పులు చేయలేదని, విషయం కోర్టులో ఉన్నందున కోర్టు తనకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని అన్నారు. కాగా, మాల్యాను అప్పగించాలని భారత అధికారులు లండన్ కోర్టులో పిటిషన్ వేయగా, దానిపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, మాల్యా అప్పగింతపై దాఖలైన కేసు విచారణ డిసెంబర్ నాలుగు నుంచి నిరవధికంగా రెండు వారాల పాటు కొనసాగుతుందని బ్రిటన్ న్యాయస్థానం ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News