: చంద్రుడిపై రాళ్లను సేకరించిన సంచి మీకు కావాలా? జస్ట్.. 4 మిలియన్ డాలర్లే.. వచ్చే వారమే వేలానికి!

చంద్రుడిపై కాలుమోపి అక్కడి నమూనాలను సేకరించిన అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వాటిని ఓ సంచిలో వేశాడు. ఇప్పుడా సంచి వచ్చే వారం న్యూయార్క్‌లో వేలానికి రానుంది. దానికి 2-4 మిలియన్ డాలర్ల ధర పలికే అవకాశం ఉందని చెబుతున్నారు. చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టి 48 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జూలై 20న ఈ ‘మూన్ బ్యాగ్’ను వేలానికి పెట్టారు.

1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారి కాలుమోపి చరిత్ర సృష్టించాడు. ఇది చాలా గొప్ప విషయమని ఈ సంచిని విక్రయిస్తున్న వైస్ ప్రెసిడెంట్, సీనియర్ స్పెషలిస్ట్ ఇన్‌చార్జ్ కాసండ్రా హాటన్ పేర్కొన్నారు. చంద్రుడిపై తొలిసారి నమూనాలు సేకరించిన తొలి మనిషి ఉపయోగించిన ఈ సంచి చాలా విశేషమైనదని ఆయన పేర్కొన్నారు. ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై ఐదు ప్రాంతాల్లోని ధూళి, రాళ్ల శకలాలను సేకరించి ఈ సంచిలో వేశారు. చంద్రుడిపై నుంచి భూమికి తిరిగి వచ్చిన తర్వాత అపోలో 11 స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రపంచంలోనే అతిపెద్దదైన స్మిత్‌సోనియన్ మ్యూజియానికి తరలించారు.

More Telugu News