: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ గెలుపుకు కార‌ణం వికీలీక్స్‌!

హిల్ల‌రీ క్లింట‌న్‌ను విమ‌ర్శిస్తూ వికీలీక్స్ బ‌ట్ట‌బ‌య‌లు చేసిన విష‌యాలే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుకు కార‌ణ‌మ‌య్యాయ‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు ట్విట్ట‌ర్ పోస్టుల‌ను అధ్య‌య‌నం చేసిన లండ‌న్‌లోని ఎడిన్‌బ‌ర్గ్ ప‌రిశోధ‌కులు ఈ విష‌యం స్ప‌ష్టం చేశారు. సోష‌ల్ మీడియాలో హిల్ల‌రీని పొగిడిన వారి కంటే వికీలీక్స్ వంక‌తో తిట్టిన వారే ఎక్కువ‌గా ఉన్నార‌ని, ట్రంప్‌కు మాత్రం తిట్టిన వారు, పొగిడిన వారు స‌మానంగా ఉన్న‌ట్లు ఈ అధ్య‌య‌నంలో తేలింది.

 ట్రంప్ మ‌ద్ధ‌తుదారులు ఆయ‌న హామీలు, ల‌క్ష్యాలు, భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల గురించి ఎక్కువ‌గా ట్వీట్ చేస్తే, హిల్ల‌రీ మద్దతుదారులు మాత్రం ట్రంప్ మీద దుమ్మెత్తిపోసే ట్వీట్లే ఎక్కువ‌గా చేశార‌ని స్ప‌ష్ట‌మైంది. ఎన్నిక‌ల వాద‌న‌ల్లో ట్రంప్ ప్ర‌ద‌ర్శ‌న‌ను నిందించారే త‌ప్ప ఆయ‌నకు సంబంధించిన వివాదాల‌ను ఎవ‌రూ తెర‌మీద‌కు తీసుకురాలేద‌ని తేలింది. మ‌రి హిల్ల‌రీ క్లింట‌న్ విష‌యంలో మాత్రం వికీలీక్స్ ఆధారాలు ఆమె ఓట‌మికి, ట్రంప్ గెలుపుకు ప‌రోక్షంగా కార‌ణ‌మ‌య్యాయ‌ని ప‌రిశోధ‌కులు వివ‌రించారు.

More Telugu News