: ఉద్యోగుల‌కు ఫేస్‌బుక్ గృహ‌వ‌స‌తి... 2021లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి!

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో రోజురోజుకు పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల ధాటికి ఆ ప్రాంతంలో రెంట్లు, గృహ‌స‌దుపాయాల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. నివాస భృతి కింద ఒక్కో ఉద్యోగికి 10 వేల డాల‌ర్లు ముట్ట‌జెప్పినా ఈ స‌మ‌స్య తీవ్ర‌త త‌గ్గ‌డం లేదు. అందుకే ఉద్యోగుల కోసం ప్ర‌త్యేకంగా ఒక గ్రామాన్నే నిర్మించాల‌ని ఫేస్‌బుక్ నిర్ణ‌యించుకుంది.

త‌మ ప్ర‌ధాన కార్యాల‌యానికి ద‌గ్గ‌ర‌లో 1500ల ఇళ్ల‌తో ఈ గ్రామాన్ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. 2021లోపు దీని మొద‌టి ఫేజ్ నిర్మాణం పూర్తి చేయాల‌ని యోచిస్తోంది. కేవ‌లం ఉద్యోగుల‌కే కాకుండా బ‌య‌టివారికి కూడా ఈ గ్రామంలో నివ‌సించే అనుమ‌తినివ్వాల‌ని ఫేస్‌బుక్ కంపెనీ అనుకుంటోంది. ఇదే బాట‌లో ఆల్ఫాబెట్ కంపెనీ కూడా త‌మ గూగుల్ ఉద్యోగుల కోసం ప్ర‌త్యేకంగా 300 కుటుంబాలు నివ‌సించ‌గ‌ల ఒక మాడ్యుల‌ర్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

More Telugu News