: వాహనాలపై 4.5 శాతం వరకు తగ్గించిన ఫోర్డ్‌ ఇండియా!

ఈ నెల 1 నుంచి అమ‌లులోకి వ‌చ్చిన వ‌స్తు, సేవ‌ల (జీఎస్టీ) ప‌న్ను ప్ర‌భావంతో ప‌లు వాహ‌నాల ధ‌ర‌లు దిగి వ‌స్తున్నాయి. త‌మ ప్ర‌త్య‌ర్థి కంపెనీల బాట‌లోనే వెళుతూ ప్రముఖ ఆటో తయారీ సంస్థ ఫోర్డ్‌ ఇండియా కూడా త‌మ వాహ‌నాల ధ‌ర‌ల‌ను త‌గ్గించేసింది. తమ వాహనాలన్నింటిపైన 4.5 శాతం వరకు ధ‌ర‌ల‌ను తగ్గిస్తున్నట్టు తెలిపింది. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు మ‌ళ్లిస్తున్నామ‌ని, తాము త‌గ్గించిన ఈ ధరలు ఒక్కో రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయ‌ని పేర్కొంది. స‌ద‌రు కంపెనీ తాజా ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ కారు ఏకంగా రూ.3 లక్షలు త‌గ్గింది.

కాగా, ఢిల్లీ మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్‌ ఫిగో రూ.2000 తగ్గింపుతో ల‌భ్య‌మ‌వుతోంది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్ ధర రూ.8000 మేర తగ్గింది. అలాగే ప్రీమియం ఎస్‌యూవీ ఎండీవర్ ధ‌ర‌ రూ.1.5 లక్షల కిందకి చేరింది. ముంబై న‌గ‌రంలో ఫిగో ధ‌ర‌ రూ.28 వేలు తగ్గింది. మ‌రోవైపు టీవీఎస్‌ మోటార్స్‌ కూడా ఈ రోజు నుంచి త‌మ అన్ని టూ-వీలర్స్‌ పైన రూ.4150 వరకు తగ్గిస్తున్న‌ట్లు పేర్కొంది.      

More Telugu News