: విమానంలోని ప్రయాణికులపై నీళ్లు పడ్డాయి.. మీరూ చూడండి!

అమెరికాలోని అట్లాంటా నుంచి ఫ్లోరిడా వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానంలో త‌మ త‌మ సీట్ల‌లో కూర్చొని ప్ర‌యాణిస్తోన్న వారిపై నీళ్లు ప‌డ్డాయి. వ‌ర్షపు చినుకులు ప‌డుతున్న‌ట్లు త‌మ‌పై ఆ నీళ్లు ప‌డుతుంటే ప్ర‌యాణికులు షాక‌య్యారు. త‌మ వ‌ద్ద ఉన్న వ‌స్తువుల‌ను త‌ల‌పై పెట్టుకుని కొద్దిసేపు అలాగే ప్ర‌యాణించారు. రేకులకు క‌న్నాలు ప‌డితే ఇళ్ల‌లో నీరు కారిన‌ట్లు విమానం టాప్ నుంచి ఇలా నీళ్లు కార‌డంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ సంఘ‌ట‌న జ‌రుగుతున్న‌ప్పుడు ఓ ప్ర‌యాణికుడు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో ఓ వ్యక్తి కూర్చున్న సీటుపై నీళ్లు ప‌డుతున్నాయి. త‌న వ‌ద్ద ఉన్న‌ మ్యాగజైన్‌ను ఆయ‌న‌ అడ్డుగా పెట్టుకున్నాడు. స‌ద‌రు విమాన‌యాన సంస్థ ప్ర‌యాణికుల‌కు క‌లిగిన అసౌక‌ర్యానిరికి గాను ఫైన్ చెల్లించింది.   

More Telugu News