: సలావుద్దీన్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ అనడం అన్యాయం: గగ్గోలు పెడుతున్న పాకిస్థాన్

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో కాలుపెట్టడానికి కొన్న గంటల ముందు పీవోకేలో ఉంటూ కశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్‌ (71) ను 'గ్లోబల్ టెర్రరిస్టు'గా అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ షాక్ తింది... అమెరికా నిర్ణయం అన్యాయమని పాకిస్థాన్ గగ్గోలు పెడుతోంది. ప్రస్తుతం సలావుద్దీన్ యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ అధ్యక్షుడిగా (పాకిస్థాన్ లోని అన్ని ఉగ్రవాద గ్రూపులకు అధ్యక్షుడి హోదాలో) వ్యవహరిస్తున్నాడు.

దీంతో పాకిస్థాన్ అమెరికా నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ కశ్మీర్ పోరాటానికి రాజకీయ, దౌత్యపరంగా, నైతికంగా మద్దతిస్తామని స్పష్టం చేసింది. దీనిపై భద్రతా వ్యవహారాల నిపుణులు ఈ నిర్ణయం 25 ఏళ్ల క్రితం అమెరికా తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు. అమెరికా తాజా నిర్ణయంతో అతనిపై చర్యలు తీసుకోవాలని పాక్ ను అమెరికా కోరే అవకాశం ఉందని... తాజా నిర్ణయంతో ఉగ్రవాదంపై పాక్ వ్యవహార శైలిని అమెరికా బహిర్గతం చేసిందని, ఇది ఆ దేశానికి అంతర్జాతీయ సమాజంలో చెడ్డపేరు తీసుకురానుందని వారు అభిప్రాయపడుతున్నారు. 

More Telugu News