: ఇకపై ఛాంపియన్స్ ట్రోఫీ లేనట్టే!

నాలుగేళ్లకోసారి క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ కనుమరుగు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్ సన్ చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. వన్డే మ్యాచ్ ల టోర్నమెంట్ల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని రిచర్డ్ సన్ అన్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ ను మాత్రమే కొనసాగించాలని అనుకుంటున్నట్టు చూచాయగా చెప్పారు. భవిష్యత్తులో 16 నుంచి 20 జట్ల వరకు క్రికెట్ ఆడే అవకాశం ఉండటంతో... అది టీ20ల ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు.

More Telugu News