: పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడాలని ట్రంప్ ఆదేశాలు!

ఉగ్రవాదులకు ఊతమిస్తూ, వారి స్థావరాలను కొనసాగించేందుకు సహకరిస్తున్న పాకిస్థాన్ పై మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. పాక్ ఉగ్ర స్థావరాలపై మానవ రహిత విమానాలతో దాడులు చేసేందుకు ట్రంప్ నుంచి ఆదేశాలు వచ్చాయని రక్షణ శాఖ అధికారి ఒకరు 'రాయిటర్స్' వార్తా సంస్థకు తెలిపారు. పాకిస్థాన్ కు అందిస్తున్న సహాయ సహకారాలను తగ్గించాలని, 'నాన్ - నాటో' సభ్యదేశాల్లోని ప్రధాన దేశాల్లో ఒకటైన పాకిస్థాన్ రేటింగ్ ను తగ్గించాలని కూడా ట్రంప్ సూచించినట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. తమంతట తాముగా ఉగ్ర కార్యకలాపాలపై పాక్ పాలకులు ఉక్కు పాదం మోపుతారని ఎదురుచూశామని, అది జరగదని తేలడంతో, ఆఫ్గనిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై జరుపుతున్నట్టుగానే డ్రోన్ దాడులను పాక్ లోనూ చేయాలని ట్రంప్ పేర్కొన్నట్టు ఆయన తెలిపారు. ఈ విషయమై స్పందించాలని వాషింగ్టన్ లోని పాక్ ఎంబసీని కోరగా, వారు స్పందించలేదు.

More Telugu News