: ఛాంపియన్స్ ట్రోఫీలో 'ఛాంపియన్' టీమిండియా ఓపెనరే!

ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్ టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావనే... గతంలో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసి, మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన శిఖర్ ధావన్, ఈ సారి కూడా మ్యాన్ ఆఫ్ ది టోర్నీ రేసులో అందరికంటే రెండడుగులు ముందే ఉన్నాడు. ఈ టోర్నీలో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌ ల్లో 680 పరుగులు చేసిన ధావన్‌.. భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ (665)ని అధిగమించాడు.

అలాగే.. వరుసగా రెండు ఎడిషన్లలో 300 పైచిలుకు స్కోరు చేసిన తొలి టీమిండియా బ్యాట్స్‌ మన్‌ గా కూడా నిలిచాడు. తాజా టోర్నీలో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో 317 పరుగులు చేసిన ధావన్, 2013లో 363 పరుగులతో 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా కూడా నిలిచాడు. అంతే కాకుండా ఐసీసీ ఈవెంట్లలో వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడు కూడా ధావనే కావడం విశేషం.‌ ఈ ఘనతను ధావన్ కేవలం 16 ఇన్నింగ్స్ లలో సాధించాడు.

More Telugu News