: వక్ర బుద్ధిని బయటపెట్టుకున్న బంగ్లాదేశ్ ఫ్యాన్స్.. కుక్క ఎవరో తేలిపోతుందన్న ఇండియన్ ఫ్యాన్స్

బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు తమ వక్ర బుద్ధిని మరోసారి బయట పెట్టుకున్నారు. బంగ్లా జాతీయపతాకంతో ఉన్న ఓ పులి... ఇండియా జెండాతో ఉన్న ఓ కుక్కను వేటాడుతున్నట్టు ఉన్న పొటోను సోషల్ మీడియాలో పెట్టి భారతీయుల రక్తం మరిగేలా చేశారు. ఈ ఫొటోను సిఫాత్ అబ్దుల్లా అనే ఓ వ్యక్తి  సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పైగా, 'సోదరులారా, ఇది గొప్ప పోరు కానుంది' అంటూ ఓ క్యాప్షన్ పెట్టాడు. దీనిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. టీమిండియా కాలి గోటికి కూడా సరిపోని బంగ్లాదేశ్ తమను వేటాడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే కుక్క ఎవరు, పులి ఎవరు అనే విషయం తేలిపోతుందని అంటున్నారు. బంగ్లాను చిత్తు చేసి, ఆ దేశానికి, ఆ దేశ అభిమానులకు గట్టిగా బుద్ధి చెప్పాలంటూ టీమిండియా ఆటగాళ్లను కోరారు.

2015 ఆసియా కప్ ఫైనల్ కు బంగ్లా చేరినప్పుడు, ఆ జట్టు భారత్ ను ఓడించినప్పుడు కూడా ఆ దేశానికి చెందిన అభిమానులు ఇలాగే శ్రుతిమించి ప్రవర్తించారు. బంగ్లాకు చెందిన ఓ ప్రముఖ వార్తా పత్రిక కూడా దిగజారి ప్రవర్తించింది. భారత ఆటగాళ్లు ఉన్న ఓ పొటోను ఫొటో షాప్ ద్వారా... భారత ఆటగాళ్ల తలలపై సగం జుట్టు లేకుండా చేసి, ఆ జుట్టును కెప్టెన్ ముస్తాఫిజుర్ కత్తెరతో తొలగించినట్టు ప్రచురించింది. అప్పట్లో ఇది తీవ్ర వివాదాస్పదం అయింది. అయితే, ఆ వివాదంపై ఒక్క బంగ్లా ఆటగాడు కూడా అప్పట్లో స్పందించకపోవడం గమనార్హం.

More Telugu News