: సిమ్‌కార్డ్ పనిచేయకుంటే వినియోగదారుడికి రూ.5 వేలు పరిహారం.. ట్రాయ్ ప్రతిపాదన!

విదేశీ ప్రయాణాల సమయంలో టెలికం కంపెనీలు ఇచ్చిన సిమ్‌కార్డులు పనిచేయకుంటే వినియోగదారులకు ఆయా నెట్‌వర్క్ ప్రొవైడర్లు రూ.5వేలను పరిహారంగా చెల్లించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులిద్దరికీ ఇది వర్తిస్తుందని ట్రాయ్ పేర్కొంది. ప్రీపెయిడ్ కస్టమర్లకు అయితే ఇంటర్నేషనల్ రోమింగ్ కోసం చెల్లించిన మొత్తాన్ని కూడా పరిహారంతో పాటు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

సర్వీస్ ప్రొవైడర్లు జారీ చేసిన సిమ్‌కార్డులు, గ్లోబల్ కార్డులు యాక్టివేట్ కాకపోయినా, సరైన సిగ్నల్ లేకపోవడం వల్ల కాలింగ్‌లో ఇబ్బంది పడినా, సిగ్నల్ కవరేజీ లేకపోయినా పరిహారం ఇవ్వాల్సిందేనని వివరించింది. అది కూడా 15 రోజుల్లోపే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంటర్నేషనల్ సిమ్ కార్డు, గ్లోబల్ కాలింగ్ కార్డ్ కంపెనీలతో విస్తృత చర్చల అనంతరం ట్రాయ్ ఈ ప్రతిపాదనలు చేసింది.

More Telugu News