: డొనాల్డ్ ట్రంప్ పై కోర్టులో దావా వేసిన 200 మంది డెమొక్రాట్లు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన నాటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు లేదా చర్యలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. తాజాగా ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ విధుల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారంటూ సెనేట్ కమిటీ ముందు ఇచ్చిన ఏడు పేజీల లిఖితపూర్వక వాంగ్మూలం పెను కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ పై అభిశంసన తప్పదని వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ దిశగా ఎలాంటి చర్యలు మొదలు కాకపోయిన నేపథ్యంలో...తాజాగా, రాజ్యాంగ నియమాలను అతిక్రమించారని, విదేశీ నేతల నుంచి భారీ ఎత్తున నిధులు తీసుకున్నారని డెమోక్రటిక్‌ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ట్రంప్‌ కు వ్యతిరేకంగా సుమారు 200 మంది డెమోక్రాట్లు ఫెడరల్ జిల్లా కోర్టులో దావా వేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ తన వ్యాపార సంస్థల ద్వారా విదేశీ నేతల నుంచి అనేక బహుమతులు, నిధులు తీసుకున్నారని ఈ ఫిర్యాదులో వారు ఆరోపించారు. ఇలా నిధులు లేదా బహుమతులు తీసుకునే ముందు అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ట్రంప్ అలాంటి నిబంధనలేవీ పాటించలేదని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించిన ట్రంప్ పై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని వారు కోరారు. 

More Telugu News