: కీళ్ల నొప్పులకు సరికొత్త పరిష్కారం కనుగొన్న శాస్త్రవేత్తలు

కీళ్లనొప్పుల (ఆస్టియో ఆర్థరైటిస్) నివారణకు సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికాలోని బాల్టిమోర్ లో గల జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని చెబుతున్నారు. వెన్నెముక గల జీవుల్లో కొన్ని రకాల కణాలు శరీరంలో పేరుకుపోతుంటాయని, వాటి కారణంగానే ఆస్టియో ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) వస్తుంటాయని అన్నారు. ఇలా పేరుకుపోయిన కణాలు తరువాత కేన్సర్ కు దారితీస్తాయని వారు చెబుతున్నారు. ఈ కణాలలో వయసు మళ్లిన కణాలను తొలగించడం ద్వారా ఆస్టియో ఆర్థరైటిస్ రావడాన్ని వాయిదా వేయవచ్చని వారు చెప్పారు. 

More Telugu News