: 650 మంది బ్రిటన్ పార్లమెంటు సభ్యుల్లో 208 మంది మహిళలే!

బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో మహిళలు సత్తాచాటారు. మొత్తం 650 స్థానాలున్న బ్రిటన్‌ దిగువసభలో 208 స్థానాల్లో మహిళలు విజయం సాధించడం విశేషం. 2015లో జరిగిన పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో 191 మంది మహిళలు ఎంపీలుగా విజయం సాధించి రికార్డు నెలకొల్పారు. ఈ సారి అంతకంటే మెరుగైన ఫలితాలు సాధించిన మహిళలు 208 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి ఆ రికార్డును అధిగమించారు.

కాగా, బ్రిటన్ లో ప్రధాన పోటీ కన్జర్వేటివ్, లేబర్ పార్టీల మధ్య ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ మహిళలు కూడా ఆ రెండు పార్టీల నుంచే ప్రాతినిథ్యం వహించి విజయం సాధించారు. కాగా, కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాల్లో విజయం సాధించగా, లేబర్ పార్టీ 261 సీట్లను గెలుచుకుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలు ఏ పార్టీ గెలుచుకోకపోవడంతో, ఉత్తర ఐర్లాండ్ లోని డెమొక్రాటిక్ యూనియనిస్టు పార్టీకి చెందిన 10 మంది ఎంపీల మద్దతుతో కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి, అధికారం పంచుకోనుంది. 

More Telugu News