: బావను పెళ్లి చేసుకోవడమే బెస్టు....చిన్నవాడైతే మరీ మంచిది!: ఇవీ నేటి యువతుల పెళ్లి ఆలోచనలు!

దేశంలో భ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయి. దాంతో అమ్మాయిల జనాభా తగ్గిపోతోంది. అబ్బాయిలకు వధువును వెతకడం తల్లిదండ్రులకు చాలా కష్టమైపోతోంది. ఈ నేపథ్యంలో నేటి తరం అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారు? అబ్బాయిలు ఎలా వుండాలనుకుంటున్నారు? వంటి విషయాలపై ఒక మేట్రిమోనీ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో యువతులు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న అమ్మాయిల్లో 97 శాతం మంది త‌మ క‌న్నా చిన్న వ‌య‌సు ఉన్న వ్య‌క్తిని పెళ్లి చేసుకోవడానికే మొగ్గుచూపడం విశేషం. అలాగే 80 శాతం మంది అమ్మాయిలు వరసైన వాడినే (మామ కొడుకు) పెళ్లాడేందుకు సిద్ధమంటున్నారు.

మైక్రో ఫ్యామిలీలుగా విడిపోతున్న తరుణంలో ఎవరూ ఊహించన విధంగా 95 శాతం మంది అమ్మాయిలు ఉమ్మ‌డి ఫ్యామిలీ అంటేనే ఇష్ట‌మ‌ని చెప్పడం ఆశ్చర్యకరం. 90 శాతం అమ్మాయిలు చింద‌ర వంద‌ర‌గా ఉన్న ఇల్లును అబ్బాయిలే క్లీన్ చేసి, సర్ది పెట్టాలని ఆశిస్తున్నారు. అబ్బాయిలను దారికి తెచ్చుకోవడానికి, టీవీ రిమోట్ తమ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళను బ్లాక్ మెయిల్ చెయ్యడం లేదా మంచి వంట చేయడం చేసి సాధించుకుంటామని సమయస్పూర్తి ప్రదర్శించారు. 85 శాతం మంది అమ్మాయిలు తమ ఊరికి దగ్గర్లో ఉండే అబ్బాయిని వివాహమాడేందుకు సై అంటున్నారు. అలా చేస్తే తల్లిదండ్రులతో కలిసి ఉండొచ్చన్నది వారి ఆలోచన. అబ్బాయిలకు సహనం ఉండదని, అందుకే అమ్మాయిలతో షాపింగ్ కు వెళ్లరని అంతా అభిప్రాయపడ్డారు.

More Telugu News