: టాప్ 7 కంపెనీలకు పది వేల వీసాలైనా ఇవ్వని అమెరికా... భారీగా పడిపోయిన హెచ్-1బీలు!

ఇండియాలో టాప్-7 ఔట్ సోర్సింగ్ కంపెనీలకు 2016లో పట్టుమని పదివేల హెచ్-1బీ వీసాలు కూడా దక్కలేదు. 2015లో పొందిన వీసాలతో చూస్తే, టాప్ కంపెనీలు 37 శాతం తక్కువగా 9,356 వీసాలను మాత్రమే పొందాయి. మొత్తం అమెరికా ఉద్యోగుల్లో ఇది కేవలం 0.006 శాతం మాత్రమేనని వాషింగ్టన్ కేంద్రంగా సాగుతున్న సంస్థ నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ తన తాజా నివేదికలో పేర్కొంది. యూఎస్ లో 16 కోట్ల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని వెల్లడించింది.

ఇక టాటా కన్సల్టెన్సీ సంస్థకు ఇచ్చిన వీసాల సంఖ్య 56 శాతం తగ్గిందని, 2015లో 4,674 వీసాలను పొందిన టీసీఎస్, 2016లో 2,040కి పరిమితమైందని పేర్కొంది. విప్రో విషయానికి వస్తే, హెచ్-1బీ వీసాల సంఖ్య 3,079 నుంచి 1,474కు పడిపోగా, 52 శాతం కోత నమోదైందని తెలిపింది. ఇన్ఫోసిస్ కు జారీ చేసిన వీసాల సంఖ్య 2,830 నుంచి 2,376కు తగ్గిందని ప్రభుత్వ డేటా వెల్లడించినట్టు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ పేర్కొంది. భవిష్యత్తులో ఈ కంపెనీలకు ఇస్తున్న ఉద్యోగ వీసాల సంఖ్య మరింతగా తగ్గనుందని అంచనా వేసింది.

More Telugu News