: బీ కేర్ ఫుల్... నిద్ర మాత్రలతో ఒళ్లు గుల్లవుతుంది!

ప్రపంచ వ్యాప్తంగా జనాలను ఇబ్బంది పెడుతున్న సమస్యలో నిద్రలేమి కూడా ఒకటి. కోట్లాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్ లో అయితే ప్రతి పది మందిలో ఒకరు నిద్ర కోసం నిద్రమాత్ర వేసుకుంటున్నారట. ఈ సమస్యపై అరిజోనా యూనివర్శిటీ పరిశోధకులు పరిశోధనలు నిర్వహించారు. నిద్రమాత్రలను రోజూ వాడుతున్నవారిని పరిశీలించారు.

ఈ ఔషధాల కారణంగా క్యాన్సర్, గుండెపోటు, స్పృహ కోల్పోవడం, మతిమరుపు, ఎముకలు గుల్లబారడం, స్థిమితం కోల్పోవడం వంటి సమస్యల బారిన పడుతున్నట్టు గుర్తించారు. సుదీర్ఘకాలంగా ప్రతిరోజూ పెట్టె సిగరెట్లు కాల్చేవారిలో కూడా ఇలాంటి లక్షణాలే తలెత్తుతాయని పరిశోధకుడు షాన్ యంగ్ స్టెట్ తెలిపారు. నాటింగ్ హామ్ యూనివర్శిటీ, వాషింగ్టన్ యూనివర్శిటీ, కీలె యూనివర్శిటీలు నిర్వహించిన పరిశోధనల్లో సైతం ఇవే ఫలితాలు వచ్చాయని చెప్పారు.

శారీరక శ్రమ లేనివారికి నిద్రలేమి సమస్య సహజంగానే ఉంటుందని... నడక లాంటి తేలికపాటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలని షాన్ యంగ్ స్టెట్ తెలిపారు. వ్యాయామం చేసేవారికి, శారీరక శ్రమ చేసేవారికి సహజంగానే నిద్ర వస్తుందని చెప్పారు. వారానికి కనీసం 150 నిమిషాల సమయం అయినా వ్యాయామం చేయాలని సూచించారు.

More Telugu News