: ఇదో అద్భుతం: 90 నిమిషాల పాటు చనిపోయిన వ్యక్తి.. రెండు వారాల తర్వాత లేచి కూర్చున్నాడు!

సాఫీగా సాగిపోతే జీవితంలో మజా ఉండదు. అనుకోని సంఘటనల సమాహారమే జీవితం.. కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉన్నా ఇదే నిజం. మరణం అంచువరకు వెళ్లి వచ్చాడని చాలామంది చెబుతుంటారు. ఏ ఉద్దేశంతో అలా అన్నా.. అటువంటిదే నిజమైన ఘటన అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగింది.

20 అడుగుల ఎత్తైన గోడపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన ఓ వ్యక్తి 90 నిమిషాల పాటు చనిపోయాడు. రెండు వారాల తర్వాత లేచి కూర్చున్నాడు. గోడపై నుంచి కిందపడిన ఇంజినీర్ టీజే స్కాన్లాన్‌ను ఎవరూ గుర్తించకపోవడంతో రక్తపు మడుగులో రెండు రోజులపాటు అచేతనంగా పడి ఉన్నాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి చేర్చారు. ప్రమాదంలో స్కాన్లాన్ చాతీ కింద భాగం చచ్చుబడిపోయింది. ఫలితంగా కాళ్లు పనిచేయడం మానేశాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా గుండె ఆగిపోయింది. దాదాపు గంటన్నరపాటు గుండె పనిచేయడం మానేసింది. సాంకేతికంగా స్కాన్లాన్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.

ప్రమాదం కారణంగా అతడి వెన్నెముక విరిగిపోయింది. కిడ్నీలు, ఊపిరితిత్తులు పనిచేయడం మానేశాయి. రెండు రోజులపాటు రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉండడంతో అతడి అవయవాలు నీలం రంగులోకి మారిపోయాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయింది. కేవలం ఐదు శాతం మాత్రమే బతికే అవకాశం ఉండగా వైద్యుల కృషితో రెండు వారాల తర్వాత కళ్లు తెరిచి అద్భుతానికి నాంది పలికాడు.

More Telugu News