: జార్జియా లిటిల్ మిస్ యూనివర్స్ పోటీలకు 12 ఏళ్ల ఒడిశా బాలిక.. ఆ అవకాశం దక్కించుకున్న తొలి అమ్మాయిగా రికార్డు!

పన్నెండేళ్ల ఒడిశా బాలిక పద్మాలయ నందా అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. అమెరికాలోని జార్జియాలో బుధవారం ప్రారంభమైన లిటిల్ మిస్ యూనివర్స్-2017 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. 16 మంది పోటీదారులను వెనక్కి నెట్టిన ఆమె ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. ఫలితంగా ఒడిశా, ఈశాన్య, తూర్పు భారతదేశం నుంచి ఎంపికైన తొలి బాలికగా గుర్తింపు దక్కించుకుంది.

కటక్‌లోని ఓ పాఠశాలలో పద్మాలయ 8వ తరగతి చదువుతోంది. లిటిల్ మిస్ యూనివర్స్ పోటీలతోపాటు గ్రీస్‌లో జరగనున్న లిటిల్ మిస్ వరల్డ్ పోటీలోనూ ఆమె భారత్ తరపున పాల్గొననుంది. రెండింటిలోనూ మంచి ప్రదర్శన కనిపించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని పద్మాలయ ఈ సందర్భంగా తెలిపింది. గతంలో కోజికోడ్‌లో జరిగిన జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పోటీల్లో లిటిల్ మిస్‌ కిరీటాన్ని పద్మాలయ గెలుచుకుంది. అదే కాదు, మరో మూడు టైటిళ్లను కూడా నందా ఎగరేసుకుపోయింది.

సుప్రీంకోర్టు ప్రముఖ లాయర్ ప్రసన్నకుమార్ నందా, డాక్టర్ సుభాసుధ ప్రియదర్శిని కుమార్తె అయిన ప్రియదర్శిని ఆడిషన్స్ సమయంలో అందరినీ మెస్మరైజ్ చేసింది. తనకు మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమన్న ప్రియదర్శిని ప్రస్తుతం తన దృష్టంతా చదువుపైనే ఉందని పేర్కొంది. ప్రియదర్శిని లిటిల్ మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుని దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆశిద్దాం.

More Telugu News