: లైవ్ లో రిపోర్టరుకు లైంగిక వేధింపులు... బలవంతంగా ముద్దాడబోయిన ఆటగాడిని వెలేసిన ఫ్రెంచ్ ఓపెన్... వీడియో చూడండి!

ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు వచ్చిన ఆటగాడు సభ్య సమాజం తలవంచుకునేలా దారుణంగా ప్రవర్తించాడు. ప్రత్యక్ష ప్రసారం అని కూడా చూడకుండా తనను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన యాంకర్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె మెడ చుట్టూ చేతులు వేసి బలంగా పట్టుకుని పలుమార్లు ముద్దాడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన రోలాండ్ గారోస్ లో సంచలనం కలిగించింది. తొలి రౌండులో ఓడిపోయిన మాక్సమీ హమోవ్ అనే ఫ్రెంచ్ ఆటగాడు ఈ దారుణం చేశాడు.

'యూరో స్పోర్ట్' జర్నలిస్ట్ మాలీ థామస్, హమోవ్ చేతిలో చిక్కి బయట పడలేక, ప్రత్యక్ష ప్రసారానికి అవాంతరం కలగడం ఇష్టంలేక ఎంతో ఇబ్బంది పడింది. ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్న ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు హమోవ్ ను వెలేస్తున్నట్టు తెలిపారు. జరిగిన ఘటనపై మాలీ స్పందిస్తూ, "నేను అనుకోని ఘటన ఇది. లైవ్ కాకుంటే, అతడిని చావగొట్టేదాన్ని" అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం వరల్డ్ నంబర్ 287 ఆటగాడిగా ఉన్న హమోవ్ అక్రిడేషన్ ను రద్దు చేశామని, జరిగిన ఘటనకు మాలీకి క్షమాపణలు చెబుతున్నామని టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు.

More Telugu News