: ప్రపంచంలోనే అతి పలుచనైన ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించిన ఆసుస్!

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఆసుస్ ప్రపంచంలోనే అతి పలుచనైన కన్వెర్టబుల్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. కంప్యూటెక్స్ 2017 కాన్ఫరెన్స్‌లో మొత్తం ఐదు ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించిన ఆసుస్ జెన్‌బుక్ ఫ్లిప్ ఎస్‌తో ఆకట్టుకుంది. ఇది ప్రపంచంలోనే అతి  పలుచనైన (స్లిమ్మెస్ట్) ల్యాప్‌టాప్ అని పేర్కొంది. 10.9 మిల్లీ మీటర్ల మందం, 1.1 కేజీ బరువున్న ఈ ల్యాప్‌టాప్‌ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. సెవెంత్ జనరేషన్ ఇంటెల్ కోర్ సీపీయూ, 1 టెరాబైట్ స్టోరేజీ, లిక్విడ్ క్రిస్టల్ పోలీమర్ ఫ్యాన్, విండోస్ హల్లో సెక్యూరిటీ.. తదితర ఫీచర్లు ఉన్నాయి. ధర సుమారు రూ.71 వేలు.

More Telugu News