: యూరప్ నుంచి వచ్చే విమానాల్లో ల్యాప్‌టాప్‌లపై నిషేధం లేదు.. స్పష్టం చేసిన అమెరికా

అమెరికాకు వచ్చే విమానాల్లో ల్యాప్‌టాప్‌లపై నిషేధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. యూరప్ నుంచి వచ్చే విమానాల్లో వాటిపై నిషేధం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ల్యాప్‌టాప్‌లలో బాంబులను అమర్చే సరికొత్త టెక్నాలజీని ఆల్‌ఖాయిదా అభివృద్ధి చేస్తోందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో అమెరికా ల్యాప్‌టాప్‌లపై నిషేధం విధించింది. మొబైల్ ఫోన్ కంటే పెద్దగా ఉండే డివైజ్‌లను విమానాల్లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.  ముఖ్యంగా మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాల్లో ల్యాప్‌టాప్‌లను నిషేధించింది. అయితే తాజాగా ఇప్పటి నుంచి అమెరికా వచ్చే యూరప్ విమానాల్లో వీటిపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ దేవ్ లాపిన్ తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన అంశం మాత్రం ఇంకా పరిశీలనలోనే ఉందన్నారు.

More Telugu News