: ఉత్తరకొరియాపై అణుదాడికి సిద్ధమైన అమెరికా, దక్షిణకొరియా?

ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా వరుసగా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ, శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్. అవసరమైతే అమెరికానే భస్మీపటలం చేస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాపై అణుబాంబు వేయడానికి అమెరికా, దక్షిణకొరియాలు కసరత్తు చేశాయని తెలుస్తోంది. ఉత్తరకొరియా నిన్న మరో క్షిపణి పరీక్షను నిర్వహించిన అనంతరం... అమెరికా, దక్షిణకొరియాలు సూపర్ సోనిక్ బీ-1బీ లాన్సర్ బాంబును పరీక్షించాయి. ఈ సంయుక్త చర్య ఆందోళనలను రేకెత్తిస్తోంది. దీనిపై ఉత్తరకొరియా మీడియా స్పందిస్తూ, అణుబాంబు వేయడానికే ఈ కసరత్తును నిర్వహించారని పేర్కొంది. మరోవైపు జపాన్ ప్రధాని షింజే అబే మాట్లాడుతూ, ఉత్తరకొరియా రెచ్చగొట్టే చర్యలకు సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ పరిణామాలన్నీ మరో అణుదాడికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

More Telugu News