: మా సమస్యకు ఇండియా కారణం కాదు: తొలుత తిట్టి పోసి ఆపై మెట్టు దిగిన బ్రిటీష్ ఎయిర్ వేస్

బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యలకు, కస్టమర్లకు ఏర్పడిన సేవల్లో అంతరాయానికి ఇండియానే కారణమని తిట్టిపోసిన బ్రిటీష్ ఎయిర్ వేస్ దిగొచ్చింది. తమ ఐటీ వ్యవస్థలో వైఫల్యానికి భారత్ కు ఇచ్చిన ఔట్ సోర్సింగ్ ఎంతమాత్రమూ కారణం కాదని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలెక్స్ క్రూజ్ తెలిపారు. ఇండియావల్లే అంతరాయం ఏర్పడ్డట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. కొన్ని క్షణాలు విద్యుత్ లో అంతరాయం ఏర్పడగా, ఆపై బ్యాకప్ సిస్టమ్ పనిచేయని కారణంగానే సమస్య ఏర్పడిందని తెలిపారు. కాగా, తాను రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తలు పుకార్లేనని, సర్వర్లలో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

కాగా, గడచిన మూడు రోజులుగా బ్రిటీష్ ఎయిర్ వేస్ సేవలు నిలిచిపోగా, వేలాది మంది ఎయిర్ పోర్టుల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. భారత ఉద్యోగులే దీనికి కారణమని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ జీఎంబీ యూనియన్‌ తీవ్ర ఆరోపణలు చేయగా, ఇప్పుడు సంస్థ చీఫ్ వాటిని ఖండించడం గమనార్హం.

More Telugu News