: మనిషి పెదవి దాటి బయటకు రాని రహస్యాలివే!

ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎవరికీ చెప్పని రహస్యాలు ఉంటాయి. ఈ రహస్యాలపై చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఒక మనిషి సగటున 13 రహస్యాలను ఏకబిగిన దాచుకోగలరని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ప్రొఫెసర్ మైఖేల్ స్లెపియన్ తెలిపారు.  ఈ పరిశోధనలో భాగంగా మొత్తం 13,000కు పైగా రహస్యాలను పరిశోధకులు విశ్లేషించారు. ఈ మొత్తం రహస్యాల్లో అసలు పెదవి దాటి వెలుపలికే రాని 38 రకాల రహస్యాలను పరిశోధకులు గుర్తించగలిగారు.

వీటిలో ప్రధానమైనవేంటంటే... 'అక్రమ సంబంధాలు, అడ్డూ అదుపూ లేకుండా ఉక్కిరిబిక్కిరి చేసే శృంగార భావనలు, ఆర్థికపరమైన అంశాలు' అని ప్రొఫెసర్‌ మైఖేల్‌ స్లెపియన్‌ తెలిపారు. ఈ రహస్యాలను పదిలంగా మనసుల్లో నిక్షిప్తం చేసుకోవడం కూడా ఒక్కోసారి పెనుభారంగా మారుతుందని, ఆ రహస్యాల భావనలు ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తాయని ఆయన తెలిపారు.

More Telugu News