: కోహ్లీని తక్కువగా అంచనా వేస్తే... కంగుతింటారు: హస్సీ

ఈ ఐపీఎల్ సీజన్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే, కోహ్లీని అండర్ ఎస్టిమేట్ చేయవద్దని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైక్ హస్సీ హెచ్చరించాడు. ఐపీఎల్ లో ప్రదర్శన ఆధారంగా కోహ్లీని తక్కువగా అంచనా వేస్తే... కంగుతినక తప్పదని హెచ్చరించాడు. కోహ్లీని ఎవరైనా లైట్ గా తీసుకుంటే చేదు అనుభవమే మిగులుతుందని తెలిపాడు.

ఒక గొప్ప ఆటగాడు ఎక్కువ కాలం ఫామ్ లేమిని ఎదుర్కోడని...  ఏ క్షణంలోనైనా విరుచుకుపడతాడని చెప్పాడు. ఇంగ్లండ్ లో కోహ్లీ పట్టుదలగా ఆడతాడని... తను స్థాయి ఏంటో మళ్లీ నిరూపిస్తాడని తెలిపాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే అవకాశాలు ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. ఆసీస్-ఇంగ్లండ్ ల మధ్య ఫైనల్ జరిగే అవకాశం ఉందని... అయితే ఆసీస్-ఇండియాల మధ్య జరిగే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని అన్నాడు.

More Telugu News