: ప్రముఖ యోగా గురు బిక్రమ్ చౌదరిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అమెరికా కోర్టు

భారత సంతతికి చెందిన ప్రముఖ యోగా గురు బిక్రమ్ చౌదరి (69)పై అమెరికాలోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ యోగా విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఇద్దరు ఉద్యోగినుల్ని అకారణంగా తొలగించారన్ని కేసులో... బాధితురాలికి రూ. 70 లక్షల పరిహారాన్ని చెల్లించాలంటూ గత ఏడాది కోర్టు ఆదేశించింది. అయితే, తాను ఆర్థికంగా దెబ్బతిన్నానని... అందువల్ల నష్ట పరిహారాన్ని చెల్లించలేనని ఆయన ఇంతకు ముందు తెలిపారు. ఈ కారణంగానే ఆయనపై అరెస్ట్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. అయితే, అరెస్టును తప్పించుకునేందుకు బిక్రమ్ ఇప్పటికే అమెరికా నుంచి పరారై ఉండవచ్చని భావిస్తున్నారు.

1970లలో అమెరికాలోని బెవర్లీ హిల్స్ లో ఆయన తన యోగా సెంటర్ ను ప్రారంభించారు. పాప్ స్టార్ మడొన్నా, టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే వంటి వారు ఆయన యోగా తరగతులకు హాజరయ్యేవారు. దీంతో, అనతి కాలంలోనే బిక్రమ్ చాలా పాప్యులర్ అయ్యారు. వేడిగా ఉండే గదిలో 26 ఆసనాలతో చేసే 'హాట్ యోగాను' ఆయన సృష్టించారు.

More Telugu News