: సౌదీ అరేబియాలో పాటించలేదు... వాటికన్ సిటీలో మాత్రం ట్రంప్ కుటుంబం సంప్రదాయాన్ని పాటించింది!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భర్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేడ్ కుష్నర్ తో కలిసి అధికారిక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మెలానియా అక్కడి  సంప్రదాయాన్ని పాటించకుండా, తలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండానే తిరిగారు. దీంతో గతంలో మాజీ అధ్యక్షుడు ఒబామా టూర్ ను ప్రస్తావిస్తూ విమర్శలు చేసిన ట్రంప్, సౌదీని అవమానించినట్టేనని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. ఇక సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ టూర్ ముగించుకున్న ట్రంప్...నేరుగా వాటికన్ వెళ్లారు. అక్కడ పోప్ ఫ్రాన్సిస్ ను ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేడ్ కుష్నర్ భక్తి శ్రద్ధలతో కలిశారు. ఈ సందర్భంగా మెలానియా, ఇవాంకాలు తలపై వెయిల్ (తలపై కొంగు) ధరించారు. క్యాథలిక్కుల సంప్రదాయం ప్రకారం దేవుడి సన్నిధి లేదా పవిత్రమైన ప్రదేశాల్లో తలపై వెయిల్ ధరించాల్సి ఉంటుంది. క్యాథలిక్ చర్చిలలో ఈ వెయిల్ కనిపిస్తుంటుంది. 

More Telugu News