: బీసీసీఐ పెద్దల అత్యవసర సమావేశం!

లండన్ లోని మాంచెస్టర్ లో ఓ సంగీత విభావరిపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే నిమిత్తం ఆ దేశానికి బయలుదేరనున్న భారత ఆటగాళ్ల భద్రపై చర్చించేందుకు బీసీసీఐ అత్యవసర సమావేశం జరపాలని నిర్ణయించింది. నేటి సాయంత్రం 15 మంది ఆటగాళ్లు, ఇతర సభ్యులతో కూడిన బృందం ఇంగ్లండ్ కు బయలుదేరాల్సి వుండగా, వారికి అక్కడ కల్పించే భద్రతపై ముంబై హెడ్ క్వార్టర్స్ లో ఈ సమావేశం నేటి మధ్యాహ్నం జరగనుంది.

భారత జట్టు షెడ్యూల్, ప్రాక్టీస్ మ్యాచ్ లు, ఆపై టోర్నీ జరిగే స్టేడియంలలో భద్రత తదితర అంశాలను ఇక్కడ సమీక్షించనున్నారు. ఉగ్రదాడి ఘటనను ఖండించిన ఐసీసీ, చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు వచ్చే అన్ని దేశాల జట్లకూ మరింత భద్రతను కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 28న న్యూజిలాండ్, ఆపై 30 న బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడనున్న భారత జట్టు, టోర్నీలో తొలి గేమ్ ను జూన్ 4న ఎడ్ బాస్టన్ వేదికపై పాకిస్థాన్ తో ఆడనున్న సంగతి తెలిసిందే.

More Telugu News