: నేను ముందే చెప్పాను...నాకు దేశం ముఖ్యమని!: ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్

ఐపీఎల్ సీజన్-10లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ టోర్నీ ఫైనల్ లో ఆడకపోవడంపై స్పందించాడు. టోర్నీకి ముందే యాజమాన్యానికి తనకు దేశం తరపున ఆడడం ముఖ్యమన్న విషయం స్పష్టం చేశానని చెప్పాడు. చివరి రెండు మ్యాచ్ లు ఆడే అవకాశం ఉండదని ముందే సమాచారం ఇచ్చానని అన్నాడు. దేశం తరపున ఆడడం ముఖ్యం కనుకే తాను ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో పాల్గొనేందుకు జట్టుతో కలిసి బయల్దేరానని తెలిపాడు.

కాగా, ఐపీఎల్ ఫైనల్ లో బెన్ స్టోక్స్ ఆడకపోవడంపై ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఘాటుగా స్పందించాడు. నాకౌట్ తో పాటు ఫైనల్ లో ఆడకుండా బీర్లు తాగేందుకు స్పెయిన్ వెళ్లిపోయాడని మండిపడ్డాడు. కాగా, ఈ టోర్నీలో అత్యధిక ధర పలికిన బెన్ స్టోక్స్ తన ధరకు న్యాయం చేస్తూ 14 మ్యాచ్ లలో 316 పరుగులు చేసి, 21 వికెట్లు తీశాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

More Telugu News