: తక్కువ స్కోరు చేసినా తుదివరకు పోరాడాలని ఆటగాళ్లకు చెప్పా.. అదే గెలిపించింది: రోహిత్ శర్మ

ఆదివారం జరిగిన ఐపీఎల్-10 టైటిల్ పోరులో ముంబై అనూహ్య విజయం సాధించడంపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఉత్సాహంగా ఉన్నాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. జట్టు తక్కువ స్కోరు చేసినా తుదివరకు పోరాడాలని జట్టు సభ్యలకు చెప్పానని, చివరికి అదే తమను విజయ తీరానికి చేర్చిందని పేర్కొన్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో గతరాత్రి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పుణె సూపర్ జెయింట్ జట్టును ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో ఓడించి విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ టైటిల్ పోరులో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయన్నాడు. క్రికెట్‌లో ఇది గొప్ప మ్యాచ్ అని, అందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేసి ఉంటారని అన్నాడు. చేసింది తక్కువ స్కోరు కావడంతో చివరికంటా పోరాడాలని ఆటగాళ్లకు చెప్పానని పేర్కొన్నాడు. చివరి మూడు ఓవర్లలో బౌలర్లపై నమ్మకం ఉంచి వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు వివరించాడు. తన నమ్మకాన్ని వారు నిలబెట్టారన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేయగా స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

More Telugu News