: ఐపీఎల్ విజేత ‘ముంబై ఇండియన్స్’!

ఐపీఎల్-10వ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఉత్కంఠభరితమైన పోరులో ఒక్క పరుగు తేడాతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ పై ‘ముంబై ఇండియన్స్’ విజయం సొంతం చేసుకుంది. 130 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన పుణె జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్ లో 11 పరుగులు చేయాల్సి ఉండగా ముంబై బౌలర్ మిచెల్ జాన్సన్ అద్భుత బౌలింగ్ తో తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా పుణె ప్లేయర్స్ రెండు పరుగులు మాత్రమే చేయగలిగారు. మూడో పరుగు కోసం ప్రయత్నించిన క్రమంలో సుందర్ రనౌట్ అవడంతో పుణె జట్టు ఓటమి పాలయింది.

కాగా, ‘ముంబై ఇండియన్స్’ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ లో తొలిసారిగా విజేతగా నిలిచే అద్భుత అవకాశాన్ని పుణె జట్టు చేతులారా పోగొట్టుకోవడం గమనార్హం. నిర్ణీత 20 ఓవర్లలో స్కోరు వివరాలు..
ముంబై ఇండియన్స్: 129/8, రైజింగ్ పుణె సూపర్ జెయింట్:128/6

More Telugu News