: ఫుడ్ ఆర్డర్... ఫేస్ బుక్ లో సరికొత్త ఆప్షన్!

వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవడంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సరికొత్త ఫీచర్లను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. ఇప్పటికే ఎన్నో సౌకర్యాలు తీసుకొచ్చిన ఫేస్ బుక్ ఆహార కొనుగోళ్లకు యాప్ లు విరివిగా వినియోగించడాన్ని గుర్తించింది. దీంతో ‘ఆర్డర్ ఫుడ్’ ఆప్షన్ ను తీసుకురానుంది. ఈ ఆప్షన్ ను కల్పించడం ద్వారా ఫేస్ బుక్ వినియోగదారులంతా ఇతర యాప్స్ అవసరం లేకుండా నేరుగా తమకు నచ్చిన ఆహారం ఆర్డర్ చేసుకోవచ్చు.

ఇందుకోసం ఫేస్ బుక్ సంస్థ డెలివరీ డాట్ కామ్, స్లైస్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. గత డిసెంబర్ లోనే దీనిపై ఒప్పందం కుదిరిందని ఆ సంస్థలు నిర్ధారించాయి. అయితే అది ఇప్పటికి కార్యరూపం దాలుస్తోంది. స్మార్ట్ ఫోన్ యాప్ ల వెల్లువను తగ్గించేందుకు ఫేస్ బుక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే వాతావరణం, డిస్కవర్ పీపుల్, సిటీ గైడ్స్, టౌన్‌ హాల్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆహారం కోసం ‘ఆర్డర్ ఫుడ్’ ఆప్షన్‌ ను తీసుకువస్తోంది.

More Telugu News