: వచ్చే ఐదేళ్లలో ఖాదీ పరిశ్రమ ద్వారా ఐదు కోట్ల మందికి ఉపాధి: కేంద్రం

రానున్న ఐదేళ్లలో ఖాదీ పరిశ్రమ ద్వారా ఐదు కోట్ల మందికి ఉపాధి కల్పించనున్నట్టు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖామంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ)లో సోలార్ ఆధారిత స్పిన్నింగ్ వీల్స్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికను రూపొందించినట్టు చెప్పిన ఆయన ఇది దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. వస్త్ర పరిశ్రమలో ప్రస్తుతం ఖాదీ ఉత్పత్తుల వాటా ఒక శాతంలోపే ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ కృషి కారణంగా గత రెండేళ్లుగా విక్రయాలు పెరుగుతున్నట్టు తెలిపారు. 2014లో రూ.35 కోట్ల విక్రయాలు జరగ్గా, ప్రస్తుతం అది రూ.52 వేల కోట్లకు చేరుకుందన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

More Telugu News