: స్వరం మార్చిన ట్రంప్... శత్రువును కూడా అమెరికా క్షమిస్తుందని వ్యాఖ్య!

ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ పై కారాలు మిరియాలు నూరే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వరం మారింది. కిమ్ ను ఎలా దారికి తెచ్చుకోవాలో తమకు తెలుసు అంటూ దక్షిణ కొరియా, జపాన్ సముద్ర జలాల్లో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని గత నెలలో బెదిరింపులకు దిగిన ట్రంప్... ఉత్తరకొరియా క్షిపణి పరీక్షతో ఒక అంచనాకు వచ్చారు. శత్రుదేశం తాము ఊహించినంత బలహీనమైన దేశం కాదని అర్ధం చేసుకున్నారు. అదే సమయంలో ఉత్తరకొరియా వెనుక రష్యా, చైనాలున్నాయన్న వాస్తవాన్ని ఆయన గ్రహించారు.

ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ కొరియా దౌత్యాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణకొరియా మీడియా అధికార ప్రతినిధి హంగ్ సీయోక్ హున్ తెలిపిన వివరాల ప్రకారం... 'అమెరికా ప్రపంచశాంతిని కాంక్షిస్తుంది. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం తమను ద్వేషించేవారిని కూడా అమెరికా క్షమిస్తుంది. అవసరమైతే అలాంటి వారిని కలిసి చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము' అని ట్రంప్ అన్నారు. అంతే కాకుండా చర్చలకు ఉత్తరకొరియా నిరాకరించిన పక్షంలో ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ చెప్పారని సీయోక్ హూన్ తెలిపారు.

More Telugu News