: భారత అంపైర్ సుందరం రవికి అరుదైన అవకాశం!

భారత అంపైర్ సుందరం రవికి అరుదైన అవకాశం లభించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో అంపైర్ గా వ్యవహరించేందుకు ఆయనకు అవకాశం కల్పించినట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. టోర్నీ ఆరంభ మ్యాచ్ కు ఎంపికైన ఫీల్డ్ అంపైర్లలో ఒకరిగా సుందరం రవిని నియమించినట్టు పేర్కొంది.

కాగా, జూన్ 1 నుంచి 18 వరకు కార్డిఫ్, బర్మింగ్ హోమ్, లండన్ వేదికలుగా ఈ టోర్నీ జరగనుంది. టోర్నీ తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ కు రవి, టక్కర్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. కాగా, ఐసీసీ మ్యాచ్ రిఫరీల్లో ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్ తరపున క్రిస్ బ్రాడ్, డేవిడ్ బూన్, ఆండీ పై క్రాఫ్ట్ టోర్నమెంట్ ను పర్యవేక్షించనున్నారు. సుందరం రవి, అలీమ్ దార్, కుమార్ ధర్మసేన, ఎరాస్మన్, ఇయన్ గోల్డ్ సహా పన్నెండు మంది అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

More Telugu News