: ఎక్కడో ఒక చోట అణు బాంబు వేయాల్సిందే... కిమ్ జాంగ్ నిర్ణయంతో అమెరికాకు ముచ్చెమటలు!

ప్రపంచానికి పెను విపత్తుగా మారగలడనుకుంటున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా ఏదో ఓ ప్రాంతంలో అణుబాంబు దాడి చేయాల్సిందేనని కిమ్ నిర్ణయించుకున్నట్టు వచ్చిన వార్తలతో అమెరికాకు ముచ్చెమటలు పడుతున్నాయి. తమ వద్ద ఉన్న అణుబాంబుల సంఖ్యను నానాటికీ పెంచుకుంటున్న ఉత్తర కొరియా, అణు యుద్ధానికి దింగేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు.

ప్రపంచంలోని ఎక్కడో ఓ చోట అణుబాంబును ప్రయోగించేందుకు ఆయన కృత నిశ్చయంతో ఉన్నాడని అమెరికా పసిఫిక్ అడ్మిరల్ హ్యారీ హర్రీస్ ఆందోళన వ్యక్తం చేశారు. తమకెదురయ్యే ఈ విపత్తు నుంచి తట్టుకునేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని సూచించారు. కాగా, అమెరికా తదితర దేశాల హెచ్చరికలను సైతం పక్కనబెట్టిన కిమ్, ఈ వారం ప్రారంభంలో సరికొత్త ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరిశీలించి ప్రపంచ ఆందోళనను మరింతగా పెంచిన సంగతి తెలిసిందే.

More Telugu News