: పట్టాలపైకి పేటీఎం బ్యాంకు.. 23 నుంచి కార్యకలాపాలు

పేటీఎం పేమెంట్ బ్యాంకు వచ్చేస్తోంది. ఈ నెల 23 నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు భారతీయ రిజర్వు బ్యాంకు తుది అనుమతులు మంజూరు చేసింది. దీంతో కంపెనీ తన ఈ వాలెట్ వ్యాపారాన్ని పేమెంట్ బ్యాంకుకు బదిలీ చేయనుంది. ఇప్పటికే పేటీఎంకు 21.8 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 23వ తేదీ తర్వాత పేటీఎం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ (పీపీబీఎల్)లో భాగమవుతుంది. పీపీబీఎల్‌లో చేరడం వినియోగదారులకు ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని పేటీఎంకు తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో పేటీఎం ఈ-వాలెట్‌లోని బ్యాలెన్స్‌ను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే 23వ తేదీ కంటే ముందే ఆ పనిచేయాల్సి ఉంటుంది. ఆరు నెలలుగా వినియోగించని ఈ-వాలెట్‌లోని మొత్తాలను వినియోగదారుల అనుమతితోనే పీపీబీఎల్‌లోకి మారుస్తారు. అలాగే లక్ష రూపాయల వరకు డిపాజిట్లను పేటీఎం బ్యాంకు నేరుగా స్వీకరిస్తుంది.


More Telugu News