: ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు పలు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు.. వివరాలు

ప్రముఖ ఈ- కామ‌ర్స్ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు ప‌లు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌ల‌పై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. గ‌త ఆదివారం ఫ్లిప్ కార్ట్‌ బిగ్ 10 సేల్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగా మూడో రోజయిన ఈ రోజు రాయితీకి ల‌భిస్తోన్న‌ లెనోవో కే6 ప‌వ‌ర్‌, ఐఫోన్ 7 ప్ల‌స్‌తో పాటు ప‌లు టాప్ డీల్స్ చూద్దాం..
 
* లెనోవో కే6 పవర్ (3 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ) స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌- రూ.9,999, ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్‌పై ధ‌ర 9,000

* లెనోవో కే6 పవర్ (4జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ) స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌-రూ.10,999, ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్‌పై ధ‌ర రూ.10,000

 * 17, 980 రూపాయ‌ల అస‌లుధ‌ర గ‌ల వివో వీ5 స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌- ఎక్స్‌ఛేంజ్‌పై రూ.17,000
 
* ఐఫోన్ 7 ఫ్లస్ 32 జీబీ వేరియంట్ ధ‌ర‌- రూ.54,999 (రూ.20 వేల తగ్గింపు వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్)

* ఐఫోన్‌ 128 జీబీ వేరియంట్ ధ‌ర‌-రూ.63,999 (రూ.20 వేల తగ్గింపు వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్)

* మైక్రోమ్యాక్స్ కాన్వాస్ స్పార్క్ 3 స్మార్ట్‌ఫోన్‌ ధ‌ర‌- రూ.3999 (ఎక్స్‌ఛేంజ్‌పై రూ.3,500కే)

* బ‌డ్జెట్ ధ‌ర‌లో ల‌భించే స్మార్ట్‌ఫోన్ సాన్‌సూయ్ హొరైజన్ 1 ధ‌ర- రూ.3,799

* స్వైప్ ఎలైట్ 4జీ స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌- రూ.4,999 (ఎక్స్‌ఛేంజ్‌పై రూ.4,500కే సొంతం చేసుకోవ‌చ్చు)

More Telugu News